Thursday, 18 June 2015

కలను సాకారం చేసిన "స్విమ్మింగ్ పూల్"

చాలా మాట్లాడాలన్న ఉబలాటం…. గొంతు పెగలని ఉద్వేగం….
"స్విమ్మింగ్ పూల్" ఆడియో వేడుక రోజున చాలా మాట్లాడాలనుకున్నాను. నాకు సహకరించిన చాలా మందికి ధన్యవాదాలు తెలుపాలనుకున్నాను. కానీ మీరుకురిపించిన ప్రేమకి ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. అందుకే నా బ్లాగ్ ద్వారా తెలియజేస్తున్నాను.   

మీ అందరి ఆశీర్వాదంవల్ల, దేవుడి దయవల్ల నేను మరెన్ని ఆడియో వేడుకలను జరుపుకోవచ్చు. కాని మొదటి సినిమా ఎప్పటికీ నా మనసులో ఉండిపోతుంది. అనుభూతి ఇలాగే శాశ్వితమైపోతుంది. నాకు ఇన్ని తీపి గుర్తులు మిగిల్చిన నా స్విమ్మింగ్ పూల్ టీంకి ధన్యావాదాలు.

మొదటిగా శ్రీశ్రీ మూవీ క్రియేషన్స్ ద్వారా తమ తొలి చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత ఆరుణ్ కుమార్ గారికి నా ఆభినందలు. తొలి చిత్రాన్ని నిర్మిస్తూ కూడా ఒక కొత్త సంగీత దర్శకుడిని పరిచయం చేయడానిలి పెద్దమనసుతో సాహసించినటువంటి అరుణ్ గారికి బిగ్ థాక్స్. "మీ బ్యానర్ నాకు హోం బ్యానర్ సార్. ఎనీ టైం అయాం అవైలబుల్ ఫర్ యు"        

మ్యూజిక్ డైరెక్టర్కు అయినా తన తొలి సినిమాలోని పాటలను తెరమీద చూసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. సినిమాలోని నా పాటలను అత్యంత అందంగా చిత్రీకరించిన మా డిఒపి వీరేంద్ర లలిత్ గారికి స్పెషల్ థాక్స్. “I am very thankful for capturing my songs very beautifully Virendra lalith sir. I am proud to be a part of this project in which such a senior  technician like you worked”     

పాటకైన అందమైన పదాలు సమకూరితేనే అది సంపూర్ణమౌతుంది. తన పదాల అల్లికతో నా స్వరాలపై సిరిమల్లెలు వెదజల్లిన గీత రచయిత తిరుపతికి నా ధన్యవాదాలు.

ఇక నా మ్యూజిక్ టీంకు వస్తే సౌడ్ ఇంజినీర్ వేణు అన్న అందించిన సహకారం మరిచిపోలేనిది. నాకోసం రాత్రీ పగలు తేడా లేకుండా, అంత సీనియర్ టెక్నీషియన్ అయినప్పటికీ కస్టపడి పాటలకు అద్భుతమైన క్వాలిటి అందించారు. “థాక్యు వేణు భయ్య. నెవర్ ఫర్గాట్ యువర్ సపోర్ట్ అండ్ నెవర్ లీవ్ యువర్ ఫ్రెడ్షిప్.”

ఇక వారి అద్భుతమైన గళాలతో ఆల్బంకు అందాన్నిచ్చిన మన తెలుగింటి గాయనీ గాయకులు గీతామాధురి, శ్రావణ భార్గవి, లిప్సిక, రమ్యా బెహరా, రేవంత్, సుభాష్ నారాయణన్ లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తమ గళాలతో ట్రాక్స్ పాడి సహకరించిన సౌమ్య ప్రియదర్శిని, రాజేష్ ఆర్య లకు మరియూ బ్యాక్గ్రౌడ్ స్చోర్ ఆద్యంతం కోరస్లు అందించిన అశ్వెని, స్వప్న, మనోగ్న బృందానికి బిగ్ థాక్స్.     

ఇక హీరోయిన్ ప్రియా వశిష్టకు కూడా స్విమ్మింగ్ పూల్ తొలి సినిమాయే. కనుక చిత్రం ద్వారా తనకు మరెన్ని మంచి అవకాశాలు రావాలని, మంచి కెరియర్ సొంతం కావాలిని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ప్రియ...

ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించిన బ్రహ్మిణి, గౌతమ్, రుద్రాక్ష్, రచ్చ రవి భయ్య, ప్రొఫెసర్ మురుంకర్ తదితరులందరికీ థాక్స్.     

అఖిల్ కార్తిక్.... వాట్ కెన్ సే అబౌట్ మై ఇన్స్పిరేషన్? తొమ్మిది సినిమాల్లో హీరోగా 10 సంవత్సరాలకు పైగా ఇండస్త్రీలో సుదీర్ఘ కెరియర్ ఉన్న ఒక స్టార్, తన తొలి చిత్రానికి పనిచేస్తున్న సంగీత దర్శకునితో చాలా మామూలుగా వ్యవహరిస్తూ ఉంటే? తను వేసే ప్రతీ అడుగునూ గమనిస్తూ అన్నలా సూచనలిస్తుంటే? సినిమా విజయంలో తన భాద్యతను గుర్తుచేస్తూ తన కెరియర్ కు పునాదులు వేస్థుంటే? ఏమి చేయగలం, మనసుతో థాక్స్ చెప్పటం తప్ప. " థాక్యూ కార్తిక్ భయ్యా.. లవ్ యూ సో మచ్" 

ఇక ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఎవరి వల్ల రోజు డయాజ్ మీద నిలబడగలిగానో, ఎవరివల్ల నా కలను సాకారం చేసుకునే క్రమంలో తొలి అడుగు వేయగలిగానో, ఎవరందించిన ప్రోత్సాహంతో, ఇచ్చిన నమ్మకంతో ఇంతమంది పొగడ్తలను, ప్రేమనూ పొందగలిగానో వ్యక్తే మై డైరెక్టర్ "కెప్టెన్ కూల్" చిమ్మని మనోహర్ గారు. ఏమి చెప్పినా, ఎంత ఇచ్చినా ఆయన ౠణం తీర్చుకోలేను. "<<< థాక్యూ సోమచ్ సర్... >>> దిస్ సెంటెన్స్ మీన్స్ లాట్. యు కెన్ అండర్‌స్టాండ్ ఇట్ " (ఆయన గురించి రాయటానికి ఈకొంచం స్లాట్ సరిపోదు. ఒక సపరేట్ బ్లాగ్పోస్ట్ రాస్తాను. )     

మరొక్కసారి రోజు నన్నూ, మా స్విమ్మింగ్ పూల్ టీంని ఆశీర్వదించటానికి వచ్చిన గౌరవ అథిధులకూ, స్నేహితులకూ, శ్రేయోభిలాషులకూ హృదయపూర్వక ధన్యవాదాలు.

చివరిగా నా కలవైపు నడిచేందుకు నాకు ప్రోత్సాహాన్ని, బలాన్ని అందిస్తున్న నా పేరెంట్స్కు థాక్యూ. "దిస్ ఆడియో ఈజ్ డెడికేటెడ్ టు యు"    

Monday, 15 June 2015

Hi everyone...! 


Welcome to my blog.. 
I want to share my views, experiences and my updates with you all in an elaborate manner. That's way i entered into the world of blogs. Please visit my blog and bless me as previous.

Yours
Pradeep Chandra